Wyra | సోషల్ మీడియా లింక్స్ పై ఆప్రమత్తంగా ఉండాలి

Wyra | సోషల్ మీడియా లింక్స్ పై ఆప్రమత్తంగా ఉండాలి
Wyra | వైరా, ఆంధ్రప్రభ : లింక్స్ షేర్ చేస్తే రూ. 5 వేలు అంటూ.. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే మెసేజ్ ల పట్ల తప్పక జాగ్రత్త వహించాలని వైరా ఎస్సై పుష్పాల రామారావు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఫేక్ లింక్స్ చాలా ప్రమాదకరమని, అలాంటి ఫేక్ లింక్స్ క్లిక్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్ల చేతులకి దొరికి ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
మాయ మాటలు చెప్పి లింకులు పంపే వారి మాటలు నమ్మవద్దని.. ఎలాంటి డబ్బులు రావు అని.. అలాంటి ప్రమాదకర లింకులను ఇతర గ్రూప్ లకి పంపవద్దని దయచేసి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కోద్దని ఆయన కోరారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
