మూడవ రోజూ వినాయకుడి పూజలు

అవనిగడ్డ: గణేశ్‌ న‌వ‌రాత్రులు పురస్కరించుకుని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మూడవ రోజు వినాయకుడికి ప్రత్యేక పూజ‌లు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి విక్కుర్తి శ్రీనివాసరావు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. పుష్పార్చన , వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని స్వామి వారిని ద‌ర్శించున్నారు. అనంతరం పూజ‌రులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.