వెలగపూడి – భారతదేశానికి (India) బలమైన ఆర్థిక వనరు(asset ) జనాభానే (Population ) అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM chandra babu ) అన్నారు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశం అంటే మనుషులోయ్’ అని గురజాడ అప్పారావు (gurazada apparao ) చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఆ మహానీయుడిని స్ఫూర్తిని అర్ధం చేసుకొని మనం ముందుకు వెళ్లాలని ప్రజలకు (people ) సూచించారు.
ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో ఎపి సచివాలయంలోనేడు జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, జనాభా నే ఇప్పుడు దేశాలకు గొప్ప ఆస్తి అని అన్నారు. జనాభా పెరుగుదలపై ఫోకస్ చేశామని వెల్లడించారు. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువమంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదనే చట్టం తెచ్చానని గుర్తుచేశారు. ఈరోజు తానే జనాభా పెరుగుదలను సమర్థిస్తానని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారని , ఇప్పుడు ఆవే దేశాలు జనాభా పెంచేందుకు రాయితీలు సైతం ఇస్తున్నాయని అన్నారు.
ఇప్పుడు ఏ దేశంలో జనం ఉంటే వారికే ఎక్కువ గౌరవం దక్కుతోందని అభివర్ణించారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశమని.. మన దేశంలో సుమారుగా 143 కోట్లమంది వరకు ఉన్నారని.. చైనా జనాభా 130 కోట్లని గుర్తుచేశారు. ప్రపంచంలో పాపులేషన్ పడిపోతోందని, వయసు సమస్యలు ఉన్న దేశాల్లో అభివృద్ధి ఆగిపోతుందని వెల్లడించారు. అమెరికాలో ఫెర్టీలిటీ రేట్ 1.62 మాత్రమేనని 2.1 ఫెర్టీలిటీ రేట్ ఉంటే రీప్లేస్మెంట్ ఉంటుందని.. లేనిపక్షంలో రోజురోజుకూ జనాభా తగ్గిపోతుందని తెలిపారు. బీహార్ 3.0, మేఘాలయ 2.9, వంటి రాష్ట్రాల్లో ఎక్కువ ఫెర్టీలిటీ రేట్ ఉందని.. ఏపీ 1.7కి వచ్చిందని పేర్కొన్నారు.