Workshop | ప్రాచీన కళలు మానసికోల్లాసానికి వారధులు..

Workshop | ప్రాచీన కళలు మానసికోల్లాసానికి వారధులు..
ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
Workshop | విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రాచీన కళలు ప్రతి ఒక్కరికీ మానసికోల్లాసాన్ని ఇస్తాయని ఎన్. టి.ఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.. ఆదివారం ఆయన ఆర్టిజో ఫైన్ ఆర్ట్స్ స్టూడియోలో నిర్వహిస్తున్న పోటరీ అండ్ పాట్ పెయింటింగ్ వర్క్ షాప్ ను సందర్శించారు. పిల్లలు, పెద్దలు అందరూ స్త్రీన్ టైం ని తగ్గించుకొని సృజనాత్మకతను పెంపెందించుకునేందుకు పోటరీ, పాట్ పెయింటింగ్ వర్క్ షాప్ లు దోహదపడతాయని అన్నారు.
అంతే కాకుండా హ్యాండ్ అండ్ మైండ్ కో ఆర్డినేషన్, హ్యాండ్ బిల్డింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ కి ఉపయోగపడతాయన్నారు. విజయవాడ నగర కళాప్రియుల కోసం వినూత్న రీతిలో పలు సృజనాత్మక కళాత్మక కార్యక్రమాలను రూపొందిస్తున్న ఆర్టిజో మేనేజ్మెంట్ ని ఆయన అభినందిస్తూ సమ్మర్ క్యాంప్ బ్రోచర్ ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్టిజో ఫైన్ ఆర్ట్స్ స్టూడియో ప్రిన్సిపల్ స్ఫూర్తి శ్రీనివాస్, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అమర దీప్తి కలెక్టర్ ని గౌరవంగా సత్కరించారు.



