పారిశ్రామికుల ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిటికీల కార్మికులు సమ్మె

పారిశ్రామికుల ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిటికీల కార్మికులు సమ్మె

గట్టుప్పల,ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని చేనేత చిటికీల కార్మికులకు చేసిన పని దినాలకే వేతనం కట్టిస్తామని చేనేత పారిశ్రామిక సంఘ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా చేనేత చిటికీలు కట్టే కార్మికులు మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో ఈరోజు ధర్నా నిర్వహించారు.

గత 50 సంవత్సరాల నుండి ఉన్న నియమ నిబంధనలను యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో తొలగించడం హేయమైన చర్యని యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను వెంటనే రద్దుచేసి పాత పద్ధతిలోనే సెలవులు ప్రకటించాలని కార్మికులు ప్రతి ఒక్కరు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో ప్రతి కార్మికుడు భాగస్వామి కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో చెరుపల్లి రాము,పగిళ్ల రమేష్,మందుల శంకర్,పెద్దగోని కుమార్, బీమాగాని యాదయ్య,చేపూరి నరేష్,వేమయ్య,శ్రీను లింగస్వామి ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply