న్యూయార్క్‌లో వర్క్‌షాప్..

  • హాజ‌రైన భారత ఎంపీలు
  • వాతావరణ మార్పులు, శక్తి మార్పిడి పారిశ్రామిక స్థిరత్వంపై చర్చ‌

ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణం, సుస్థిరతపై దక్షిణ ప్రపంచ పార్లమెంటేరియన్ల వర్క్‌షాప్ కొనసాగుతోంది. తొలిరోజు కార్యక్రమం స్వనితి ఇనిషియేటివ్స్ సీఈఓ రిత్వికా భట్టాచార్య ప్రారంభ ప్రసంగంతో ప్రారంభమైంది.

గ్లోబల్ స్థాయిలో వాతావరణ మార్పులు, శక్తి మార్పిడి పారిశ్రామిక స్థిరత్వం వంటి కీలక అంశాలపై చర్చించారు. విశాల స్థాయి శక్తి మార్పిడి, గ్లోబల్ వాతావరణ అత్యావశ్యకతలు, పారిశ్రామిక డీకార్బనైజేషన్ పై డిస్కస్ చేశారు.

వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం, విధాన పరమైన ఆవశ్యకతలు, స్థిరమైన అభివృద్ధి కోసం అనుసరించాల్సిన మార్గదర్శకాలు ప్రధానంగా చర్చించారు.

ముఖ్య ప్రతినిధులుగా భారత పార్లమెంట్ సభ్యులు అనురాగ్ ఠాకూర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, హిబి ఈడెన్, బ్రియా స్కడ్లర్, ఉప గవర్నర్, ఇల్లినాయిస్, డా. ఇర్ మహమ్మద్ సలాహుద్దీన్, ముహమ్మద్ రహ్మత్ కైముద్దీన్ (ఇండోనేషియా), ఇల్ ప్యో హాంగ్ (దక్షిణ కొరియా) పాల్గొన్నారు. అమోల్ మెహ్రా, క్లే స్ట్రింగర్, వికాస్, మెహతా, రోషన్ పాల్, డాన్ రైలీలు ప్రధాన వక్తలు గా పాలు పంచుకుని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Leave a Reply