జనవరి 14 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ 2027
- వడోదర, ముంబయి వేదికలుగా ఐదో సీజన్.. ఫిబ్రవరి 7న ఫైనల్
- తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో ముంబై ఇండియన్స్ ఢీ
- అన్ని మ్యాచ్‌లూ రాత్రి 7.30 గంటలకే.. బీసీసీఐ షెడ్యూల్ ప్రకటన
ఆంధ్రప్రభ, క్రీడా ప్రతినిధి :
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఐదో సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. 2027 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ టోర్నీ జరగనుంది. వడోదర, ముంబై నగరాలు ఈ పోటీలకు ఆతిథ్యమివ్వనున్నాయి. రెండు వేదికల్లోనూ చెరో 11 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
జనవరి 14న వడోదరలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. వడోదరలో జనవరి 24 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం టోర్నీ ముంబయికి మారుతుంది. అక్కడి బ్రబోర్న్ స్టేడియంలో జనవరి 26 నుంచి మిగిలిన మ్యాచ్‌లు నిర్వహిస్తారు. లీగ్ దశ పోటీలు ఫిబ్రవరి 3తో ముగుస్తాయి.
ఫిబ్రవరి 5న బ్రబోర్న్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ బెర్తు కోసం పోటీపడతాయి. అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఫిబ్రవరి 7న ఇదే స్టేడియంలో టైటిల్ పోరు జరగనుంది.
ప్లేఆఫ్స్‌తో సహా టోర్నీలోని మొత్తం 22 మ్యాచ్‌లూ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
| నం. | తేదీ | మ్యాచ్ | వేదిక |
|---|---|---|---|
| 1 | జనవరి 14, గురువారం | ఆర్సీబీ × ముంబై ఇండియన్స్ | వడోదర |
| 2 | జనవరి 15, శుక్రవారం | గుజరాత్ జెయింట్స్ × యూపీ వారియర్జ్ | వడోదర |
| 3 | జనవరి 16, శనివారం | ఢిల్లీ క్యాపిటల్స్ × ఆర్సీబీ | వడోదర |
| 4 | జనవరి 17, ఆదివారం | యూపీ వారియర్జ్ × ముంబై ఇండియన్స్ | వడోదర |
| 5 | జనవరి 18, సోమవారం | గుజరాత్ జెయింట్స్ × ఢిల్లీ క్యాపిటల్స్ | వడోదర |
| 6 | జనవరి 19, మంగళవారం | ఆర్సీబీ × యూపీ వారియర్జ్ | వడోదర |
| 7 | జనవరి 20, బుధవారం | గుజరాత్ జెయింట్స్ × ముంబై ఇండియన్స్ | వడోదర |
| 8 | జనవరి 21, గురువారం | యూపీ వారియర్జ్ × ఢిల్లీ క్యాపిటల్స్ | వడోదర |
| 9 | జనవరి 22, శుక్రవారం | గుజరాత్ జెయింట్స్ × ఆర్సీబీ | వడోదర |
| 10 | జనవరి 23, శనివారం | ఢిల్లీ క్యాపిటల్స్ × ముంబై ఇండియన్స్ | వడోదర |
| 11 | జనవరి 24, ఆదివారం | యూపీ వారియర్జ్ × గుజరాత్ జెయింట్స్ | వడోదర |
| 12 | జనవరి 26, మంగళవారం | ముంబై ఇండియన్స్ × ఆర్సీబీ | ముంబై (సీసీఐ) |
| 13 | జనవరి 27, బుధవారం | ఢిల్లీ క్యాపిటల్స్ × గుజరాత్ జెయింట్స్ | ముంబై (సీసీఐ) |
| 14 | జనవరి 28, గురువారం | ముంబై ఇండియన్స్ × యూపీ వారియర్జ్ | ముంబై (సీసీఐ) |
| 15 | జనవరి 29, శుక్రవారం | ఆర్సీబీ × ఢిల్లీ క్యాపిటల్స్ | ముంబై (సీసీఐ) |
| 16 | జనవరి 30, శనివారం | ముంబై ఇండియన్స్ × గుజరాత్ జెయింట్స్ | ముంబై (సీసీఐ) |
| 17 | జనవరి 31, ఆదివారం | యూపీ వారియర్జ్ × ఆర్సీబీ | ముంబై (సీసీఐ) |
| 18 | ఫిబ్రవరి 1, సోమవారం | ముంబై ఇండియన్స్ × ఢిల్లీ క్యాపిటల్స్ | ముంబై (సీసీఐ) |
| 19 | ఫిబ్రవరి 2, మంగళవారం | ఆర్సీబీ × గుజరాత్ జెయింట్స్ | ముంబై (సీసీఐ) |
| 20 | ఫిబ్రవరి 3, బుధవారం | ఢిల్లీ క్యాపిటల్స్ × యూపీ వారియర్జ్ | ముంబై (సీసీఐ) |
| 21 | ఫిబ్రవరి 5, శుక్రవారం | ఎలిమినేటర్ | ముంబై (సీసీఐ) |
| 22 | ఫిబ్రవరి 7, ఆదివారం | ఫైనల్ | ముంబై (సీసీఐ) |
