మహిళా సాధికారతే గ్రామాభివృద్ధికి పునాది

పిసిసి ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి
బిక్కనూర్, ఆంధ్రప్రభ:
మహిళా సాధికారతే గ్రామాల అభివృద్ధికి పునాది లాంటిదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు .బుధవారం మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కు పలు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో మహిళా సంఘ భవనాలను నిర్మించడం జరుగుతుందని చెప్పారు . ప్రతి మహిళా డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉండాలని ఆయన సూచించారు. వారికి కావలసిన రుణాలను బ్యాంకుల ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ప్రతి మహిళా సమాజంలో ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు ఉపసర్పంచ్ వినోద్ గౌడ్ ఉన్నారు.