Women’s canteens | మహిళల ఆత్మగౌరవం పెంచింది కాంగ్రెస్సే

Women’s canteens | మహిళల ఆత్మగౌరవం పెంచింది కాంగ్రెస్సే

  • ప్రభుత్వ విఫ్ బీర్ల ఐలయ్య

Women’s canteens | యాదాద్రి, ఆంధ్రప్రభ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో మహిళా క్యాంటీన్స్(Women’s canteens) వల్ల మహిళల అభివృద్ధితో పాటు ఆత్మ గౌరవం పెంచింది కాంగ్రెస్సేనని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ‌ అసెంబ్లీలో తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో భక్తులు ఎక్కువ వస్తుంటారు.. కావున మహిళా క్యాంటీన్లను యాదగిరిగుట్టలో ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్కను కోరిన‌ట్లు ఆంధ్ర‌ప్ర‌భ‌తో తెలిపారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంత మహిళలు ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని, ప్రభుత్వం తరపున మహిళా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రజా ప్రభుత్వం వచ్చాక మహిళకు పెద్దపీట వేయడం వల్ల సర్పంచ్ ఎన్నికల్లో 70శాతం మెజార్టీ(70 percent majority) రావడం జరిగిందన్నారు.. ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, మహిళలను పెట్రోల్ బంకులకు ఓనర్లను చేయడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇవ్వడం వల్ల మహిళలకు ఆత్మ గౌరవం పెరిగిందన్నారు. గత 10ఏళ్ల పాలనకు ఈ రెండు సంవత్సరాల పాలనలో మహిళలు కాంగ్రెస్ అంటే మా కుటుంబం అనే ఆలోచనతో మద్దతు ఇవ్వటం జరిగిందన్నారు. మహిళా సంఘాలను గత ప్రభుత్వం విస్మరించిన వడ్డీలేని రుణాలు ఇప్పటికి మన ప్రభుత్వం మూడు దఫాలుగా ఇవ్వడం జరిగిందని, దీని ద్వారా మహిళలు ఆర్థిక బలోపేతం అవుతారన్నారు.

గ్రామాల్లో ఇందిరమ్మ చీరలు మహిళా సంఘాలకే వస్తాయనే ఆలోచనలో ఉన్నారని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు కూడా చీరలు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం 60 రూపాయల చీరలు పంచి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీశారని, ప్రజా ప్రభుత్వం(public government) నేతన్నలు నేసిన విలువైన చీరల‌ను అర్హులైన మహిళలందరికీ ఇవ్వాలని కోరారు. తల్లిగారి ఇంటి నుండి మా అన్న రేవంతన్న పంపిస్తున్న చీర కట్టుకోవాలని మహిళలు సంతోషిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.

Leave a Reply