WOMEN | చైన్ దొంగలు బాబోయ్..
WOMEN | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని శివనగర్ ప్రాంతానికి చెందిన మహిళ మెడలో నుండి బంగారు చైన్ దొంగించడం కోసం దుండగులు ప్రయత్నించారు. మహిళ కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. ఈ ఘటన వరంగల్ నగరంలోని 34 డివిజన్ శివనగర్ లో ఆదివారం ఉదయం 6 గంటలకు చోటు చేసుకుంది. బి రాజమణి అనే మహిళ స్థానికుల ఇళ్లల్లో పని చేస్తుంది. తను పనికి వెళ్లే ముందు శివనగర్ రామాలయం ప్రాంతంలో ముసుగులేసుకున్న ఇద్దరు వ్యక్తులు తచ్చాడుతున్నారని ఆమె తెలిపారు. ఆమె తన పని ముగించుకుని వస్తున్న క్రమంలో ముసుగు వేసుకున్న వ్యక్తులు తన మెడలోని బంగారు గొలుసు లాక్కునే యత్నం చేయగా తను బిగ్గరగా కేకలు వేయడంతో దుండగులు పారిపోయారని బాధితురాలు తెలిపారు.

