సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర గొప్పది….

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర గొప్పది….
బిక్కనూర్, ఆంధ్రప్రభ : సమాజాభివృద్ధిలో మహిళలు అందిస్తున్న పాత్ర ఎంతో గొప్పదని మండలంలోని తిప్పాపూర్ గ్రామ సర్పంచ్ కుంట లింగారెడ్డి అన్నారు .ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం గ్రామ సచివాలయం ఆధ్వర్యంలో మహిళా ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో పురుషులతో సమానంగా అన్ని రంగాలలో మహిళలు ముందుకు పోతున్నారని చెప్పారు.
వివిధ విభాగాలలో వారు అందిస్తున్న సేవలు ఎంతో ఆదర్శమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
