ప్రాణం తీసిన అక్రమ సంబంధం

ప్రాణం తీసిన అక్రమ సంబంధం

  • ప్రియుడి సాయంతో భర్తను హతమార్చిన మహిళా
  • అనుమానం రాకుండా నాటకాలు
  • కన్నకూతురు చిన్నారి చెప్పిన షాకింగ్ విషయాలతో బయటపడ్డా ఘాతుకం
  • పోలీసులను ఆశ్రయించిన మృతుడి కుటుంబికులు

చండ్రుగొండ, ఆంధ్రప్రభ : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అనుమానం రాకుండా ప్రియుడి సాయంతో కడతేర్చిన భార్య నిజస్వరూపం కన్నబిడ్డ చెప్పిన షాకింగ్ విషయాలతో బట్టబయలైంది. అనుమానంతో చిన్నారిని ఆరా తీసిన మృతుడి కుటుంబ సభ్యులకు విస్తూపోయే విషయం తెలియడంతో 24 గంటల వ్యవధిలోనే వారి పాపం పండి సమాజం ఎదుట దోషులుగా నిలబడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివరాల ప్రకారం… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని తిప్పనపల్లి గ్రామానికి చెందిన షేక్ జాఫర్ సెంట్రింగ్ పని చేస్తాడు. ఇతనికి గత పది ఏళ్ల క్రితం ఏపీలోని చింతలపూడి కి చెందిన హతీజ తో పెళ్లి జరిగింది. వీరి దాంపత్య జీవితంలో ఒక పాప బాబు ఉన్నారు. ఈ క్రమంలో బ్రతుకుతెరువు కోసం మూడేళ్ల క్రితం చింతలపూడి వెళ్లారు. అక్కడే భార్య ఖతిజా కు పరిచయమైన మీరా తో అక్రమ సంబంధం ఏర్పడింది.

విషయం భర్తకు తెలియడంతో భార్యను తీసుకొని తిరిగి ఆరు నెలల క్రితం తిప్పనపల్లికి చేరుకున్నాడు. అయినప్పటికీ మార్పురాని భార్య, ప్రియుడితో రహస్యంగా ఫోన్ లో మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తమ ఇద్దరి మధ్య అడ్డుగోడలా ఉన్న భర్తను అంతం చేసేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసిన ఖతిజ అదును పని పూర్తి చేయాలనుకుంది. అందులో భాగంగా ఈనెల 11 న రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తను చంపాలని ప్రియుడికి ఫోన్ చేసి అదే రోజు రాత్రి పిలిపించుకుంది.

ఇదంతా 8 ఏళ్ల కూతురు గమనిస్తుంది. మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త పై దిండుతో ఊపిరాడకుండా చేసి చనిపోయాడని నిర్ధారించుకున్నాక మీరా తిరిగి చింతలపూడి వెళ్లిపోయాడు. తెల్లారి నిద్రలోనే తన భర్త మృతి చెందాడని ఖతిజ అందరిని నమ్మించింది. దీంతో ముస్లిం షరియత్ ప్రకారం ఈనెల 12న ఖననం జరిగింది.

అనంతరం ఖతీజా ప్రవర్తనపై మొదటి నుండే అనుమానాలున్న కుటుంబ సభ్యులు చిన్నారిని ఆరా తీయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. నాన్నను అమ్మ మరో వ్యక్తి కలిసి చంపేశారని చిన్నారి చెప్పింది. ఆగ్రహంతో ఖతిజ ను చితకబాదిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జూలూరుపాడు సిఐ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Leave a Reply