మహిళ అదృశ్యం.. కేసు నమోదు
- రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్లి తిరిగి రాని ఎల్లమ్మ
- ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన గట్టమొల ఎల్లమ్మ (35) అనే మహిళ అదృశ్యమైంది. ఆగస్టు 28న రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తల్లి తాయమ్మ ఫిర్యాదు మేరకు బుధవారం ఊట్కూర్ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు.
ఊట్కూర్ ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మ ఆగస్టు 28న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఊట్కూర్ మండల కేంద్రంలోని తన పుట్టింటికి రాఖీ కట్టేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరింది. అయితే పుట్టింటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
తల్లి తాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లమ్మ అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన మహిళ ఎత్తు సుమారు 4.5 అడుగులు, చామనఛాయ రంగు కలిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా గాలిస్తున్నారు.
ఎల్లమ్మ ఆచూకీ తెలిసిన వారు ఊట్కూర్ పోలీస్‌స్టేషన్ 8712671024 నంబరుకు లేదా ఎస్సై రమేష్ 8712670412 నంబరుకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. మహిళకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
