మృతుల కుటుంబాల‌కు చెక్కులు అంద‌జేత‌

మృతుల కుటుంబాల‌కు చెక్కులు అంద‌జేత‌

  • బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉంటాం
  • కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు

టెక్కలి, ఆంధ్రప్రభ : పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ తొక్కిసలాట ఘటనలో అసువులు బాసిన మృతుల కుటుంబాల స‌భ్యుల‌కు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు(State Minister Achchennaidu) ప్ర‌భుత్వ త‌క్ష‌ణ ప‌రిహారం అంద‌జేశారు. ఆదివారం బాధిత కుటుంబాల‌కు ఇళ్ల‌కు మంత్రులు స్వ‌యంగా వెళ్లి ఒక్కొక్క‌రికి రూ.15ల‌క్ష‌ల విలువైన చెక్కుల‌ను ఇచ్చారు.

టెక్కలి నియోజకవర్గం పరిధి నందిగాం మండలం పిట్టలిసరియా, రామేశ్వరం, శివరాంపురం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులను అందచేశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం(Central Govt) నుంచి మరో రెండు లక్షల సాయం అందుతుందని రామ్మోహన్ నాయుడు బాధిత కుటుంబాలకు తెలిపారు. ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబాలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఓదార్చారు. బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(State Governments) అండగా ఉంటాయని హామీ ఇచ్చారు.

Leave a Reply