అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా

  • సర్పంచ్ అభ్యర్థి బోయ అనిత

మక్తల్, ఆంధ్రప్రభ: మక్తల్ మండలంలోని ఖానాపూర్ గ్రామ సర్పంచ్ స్థానానికి బిజెపి మద్దతుతో పోటీ చేస్తున్న బోయ అనిత, తనకు ఒకసారి సర్పంచ్‌గా అవకాశం ఇచ్చితే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.

శనివారం ఆమె తన మద్దతుదారులతో కలిసి గ్రామంలోని ఇంటింటికీ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోయ అనిత తనను ఆదరించి ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించాలని గ్రామస్తులను కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్న వ్యక్తిగా, అవి పరిష్కరించేందుకు పూర్తి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అంతేకాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కూడా బోయ అనిత చెప్పారు. ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రాములు, నాయకులు బోయ వెంకటప్ప, బోయ బాలప్ప, మనోహర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply