చైతూ మరో బ్లాక్ స్టర్ సాధించేనా..?

చైతూ మరో బ్లాక్ స్టర్ సాధించేనా..?

అక్కినేని నాగచైతన్య కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి విభిన్న కథా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. అయితే.. చైతూ మాత్రం మాస్ సినిమాలు చేయాలి.. మాస్ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాడు. క్లాస్ ఇమేజ్ ఉన్న చైతూ మాస్ సినిమా చేయడం అంటే ప్రయోగమే. మాస్ ప్రయోగం చేసిన ప్రతిసారీ.. నిరాశే ఎదురైంది కానీ.. సక్సెస్ మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో ప్రయోగం చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. చైతూ చేస్తున్న ప్రయోగం ఏంటి..?

జోష్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన చైతన్య తొలి సినిమాతో నటుడుగా మెప్పించినా కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. ఏమాయ చేశావే సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించి యూత్ కి బాగా దగ్గరయ్యాడు. ఇక అక్కడ నుంచి చైతూ వెనుదిరిగి చూసుకోలేదు. 100% లవ్, తడాఖా, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్, రారండోయ్ వేడుక చేద్దాం, లవ్ స్టోరీ, బంగర్రాజు.. తదితర ప్రేమకథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలతో విజయం సాధించాడు. అయితే.. దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, యుద్దం శరణం.. ఇలా మాస్ మూవీస్ ప్లాపే అయ్యాయి కానీ.. హిట్ ని మాత్రం అందివ్వలేదు.

అయితే.. ఈమధ్య కాలంలో చైతూ నటించిన థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా, కస్టడీ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన ఈ టైమ్ లో తండేల్ అంటూ బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించిన తండేల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. చైతన్యకు ఫస్ట్ టైమ్ 100 కోట్ల మూవీని అందించింది. ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో నాగచైతన్య ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ బడ్జెట్టే 100 కోట్లకు పైగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్ లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. అయితే.. చైతూతో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ సినిమా చేయడం.. పైగా ఇది థ్రిల్లర్ మూవీ కావడంతో రిస్కే అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది కానీ.. కథ పై ఉన్న నమ్మకంతో మేకర్స్ అంత బడ్జెట్ పెడుతున్నారట. ఇది ఒక రకంగా చైతూకు ప్రయోగమే. మరి.. ఈ ప్రయోగం ఎంత వరకు ఫలిస్తుందో..? చైతూకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Leave a Reply