హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ పార్టీ నేతలను మద్యం స్కాం కేసు వెంటాడుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయన విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్చించారు.
అయితే రేపు ఆయన బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీంతో ఎవరూ ఊహించని విధంగా కసిరెడ్డి సిట్ నోటీసులకు స్పందించారు. రేపు(మంగళవారం) 12 గంటలకు విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు సమాచారం అందించారు. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు. రేపు కసిరెడ్డి కూడా విచారణకు హాజరవుతానని చెప్పడంతో ఎమ్ జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొంది.

