మేడారం అభివృద్ధిపై అసూయ ఎందుకు?
తాడ్వాయి, ఆంధ్రప్రభ: మేడారం అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకురాలు బడే నాగజ్యోతి చౌకబారు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంకిడి నరసింహ స్వామి, మాజీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్ మండిపడ్డారు.
తాడ్వాయి మండలంలో విలేకరుల సమావేశలో వారు మాట్లాడారు. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మేడారంతో పాటు మండలంలోని గ్రామాల్లో రూ. 5.60 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మేడారం ప్రాంతాన్ని, తాడ్వాయి పల్లెలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని గుర్తుచేశారు. నేడు మంత్రి సీతక్క నియోజకవర్గ అభివృద్ధికి రాత్రింబవళ్లు శ్రమిస్తుంటే.. కేవలం రాజకీయ ఉనికి కోసమే నాగజ్యోతి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కుటిల రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధికి సహకరించాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారమని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఇర్ప వెంకటేశ్వర్లు, ముక్తి శ్రీను, సూరకంటి సమ్మక్క-గోవర్ధన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గొంది సరిత, ఆత్మ కమిటీ డైరెక్టర్ మర్రి నరేష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
