శనీశ్వరుడికి నలుపు అలాగే నల్ల నువ్వులంటే ప్రీతి. నువ్వులు పరబ్రహ్మ స్వరూపం కావున నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేస్తారు. నలుపు అజ్ఞానానికి, మోహానికి ప్రతిరూపం. శనీశ్వరుడు అజ్ఞానాన్ని, మోహాన్ని పోగొట్టువాడు. శనీశ్వరుడికి నల్ల నువ్వులు ఇవ్వడం అనగా మన అజ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానాన్ని కోరడం. నువ్వుల నూనెతో అభిషేకం చేయడం పరబ్రహ్మను సాక్షాత్కరింప చేయడమే. వాస్తవంగా శని మేలే చేసినా మనకు కీడులాగా కనబడుతుంది. శని దోషం ఉన్నవారు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం అనగా నీకు పరమాత్మను ఇస్తున్నాను మాకు కలిగే చెడును తొలగించమని ప్రార్ధన.
శనీశ్వరుడిని నల్ల నువ్వులతో ఎందుకు పూజిస్తారు?
