ఆ రాత్రి ఏం జరిగింది..?

ఆ రాత్రి ఏం జరిగింది..?

ఆంధ్రప్రభ ప్రతినిధి,వరంగల్: జిల్లాలోని నర్సంపేట మున్సిపాలిటీ కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో ఉన్న మున్సిపాలిటీ గోడను, ఆ గోడను ఆనుకొని వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు రాత్రికి రాత్రే కూలగొట్టారు. అయితే ఈ గోడను కూల్చడం వెనక అధికారుల హస్తం ఉందంటూ పట్టణంలో జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గురువారం నాడు మున్సిపాలిటీ అధికారులు వచ్చి రోడ్డుకు ఆనుకొని ఉన్న పలు నిర్మాణాలను తొలగించే సమయంలో వెనక్కు జరగండి అని చెప్పినట్లు.. అది అలుసుగా తీసుకున్న వ్యాపారస్తులు మున్సిపాలిటీ గోడను రాత్రికి రాత్రే కూలగొట్టారు.

దుకాణ సముదాయాల వెనుక కూలగొట్టిన గోడ నిర్మిస్తామన్నారట.. అందుకు తగ్గట్టుగా అధికారులను ఒప్పించినట్లు, అధికారులు ఒప్పుకున్నట్లు, కొలతలు కూడా చేసినట్లు.. అక్కడ పాతిన కర్రలను చూస్తే అర్ధం అవుతుంది. గోడను కూల్చి మున్సిపాలిటీ స్థలాన్ని వ్యాపారస్తులకు కట్టబెట్టడం వెనుక మర్మం ఏమున్నదో ఆ భాస్కరునికే తెలియాలి. ఈ విషయం పై మున్సిపాలిటీ కమిషనర్ కాటం భాస్కర్ ను వివరణ కోరగా గోడ కూల్చిన విషయం తెలుసనీ, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Leave a Reply