ప్రకృతి వరమిది..
జామపండు వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. అయితే.. జామ ఆకుల వలన కూడా మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జామ ఆకులు (Guava Leaves) మనకు సాధారణంగా దొరుకుతాయి. కానీ.. వాటిలోని ఔషధ గుణాలు గురించి చాలా మందికి తెలియవు. ఈ జామ ఆకుల్లో ఎన్నో జౌషధాలు ఉన్నాయి. వైద్యపరంగా చూస్తే.. ఇవి చాలా ఆరోగ్య సమస్యలను పరిష్కరించే సహజ ఔషధం లాంటివని చెప్పచ్చు. అయితే.. జామ ఆకులు వలన లాభం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? అసలు జామ ఆకుల వలన ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జామ మేలు చేసేది ఎవరికి..?
జామ ఆకుల్లో క్వెర్సెటిన్ (Quercetin) అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అందువలన డయాబెటిస్ (చక్కెర వ్యాధి) ఉన్నవారికి ఈ జామ ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. రోజూ జామ ఆకు నీరు తాగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇంతకీ.. దీనిని ఎలా ఉపయోగించాలంటే.. 5–6 జామ ఆకులు తీసుకుని నీటిలో మరిగించి, ఆ నీటిని గోరువెచ్చగా తాగాలి.
జామ ఆకు వైద్యం నిజంగా పని చేస్తుందా..?
అలాగే జామ ఆకులులో ఆంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటాయి. దీని వలన కడుపు నొప్పి, గ్యాస్, డయ్యేరియా (వాంతులు, విరేచనాలు) లాంటివి తగ్గుతాయి. జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. ఎలా ఉపయోగించాలి అంటే.. కొన్ని ఆకులు మరిగించి ఆ నీటిని చల్లార్చి తాగాలి. అలా చేస్తే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఇట్టే తగ్గిపోతాయిని చెప్పచ్చు.
జామ ఆకుతో ఎలాంటి సమస్యలు మాయం..?
మౌత్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కూడా ఈ జామ ఆకుల వలన ఎంతగానో ఉపయోగం ఉంది. జామ ఆకు నీటితో గార్గిల్ చేస్తే దవడ నొప్పి, మౌత్ అల్సర్స్, బ్యాడ్ బ్రీత్ తగ్గుతుంది. జామ ఆకులలో ఉన్న యాంటీ మైక్రోబియల్ పదార్థాలు బ్యాక్టీరియాను చంపుతాయి. అలాగే చర్మ సమస్యలు ఉన్న వారికి కూడా జామ ఆకుల వలన ఉపయోగం ఉంది. జామ ఆకులను పేస్ట్ లా రాసుకుంటే పింపుల్స్, చర్మం దురద, చర్మం ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది.
జామాకుతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?
ఇక జుట్టు సమస్యలున్నవారికి కూడా జామ ఆకులు వలన ఉపయోగం ఉంది. ఎలా అంటే.. జామ ఆకులు తల చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు ఊడిపోకుండా, బలంగా పెరగడానికి సహాయపడతాయి. జామ ఆకులు నీటిలో మరిగించి ఆ నీటిని చల్లార్చి తలకు రాయాలి. దీని వలన జుట్టు రాలిపోకుండా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే.. జామ వలన డయాబెటిస్, జీర్ణక్రియ, చర్మం, పళ్ళు, జుట్టు ఊడిపోవడం తదితర సమస్యలు అన్నింటికీ సహజ పరిష్కారం. మరి ఇంకెందుకు ఆలస్యం జామ ఆకులు తీసుకోండి.. మీ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోండి..