Welfare | ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా…

Welfare | ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా…

  • ఎలగడప సర్పంచ్ అభ్యర్థి. ఎన్ అశ్విత రమేష్

Welfare | కడెం, ఆంధ్రప్రభ : కత్తెర గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న ఎలగడప జిపి సర్పంచ్ అభ్యర్థి నర్సింగ్ అశ్విత రమేష్ అన్నారు. ఈ రోజు కడెం మండలం ఎలగడప గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నర్సింగ్ అశ్విత రమేష్ పలు వీధుల గుండా పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి ఓటర్లను, ప్రజలను కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు(Welfare schemes) వివరిస్తూ గతంలో తమ భర్త నర్సింగ్ రమేష్ ఎంపీటీసీగా చేసిన జిపి అభివృద్ధి పనులను వివరిస్తూ తమ గుర్తు కత్తెర గుర్తును చూపిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈనెల 11న జరిగే ఎన్నికల్లో(elections) తమను గెలిపించుకోవాలని, తమను గెలిపిస్తే గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, ఓటర్లు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply