welfare | అభివృద్ధి సంక్షేమం కోసం…

welfare | అభివృద్ధి సంక్షేమం కోసం…

welfare | మక్తల్, ఆంధ్రప్రభ : సంగంబండ గ్రామ సమస్యల తీరాలంటే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన గవినోళ్ళ సుమిత్రమ్మను గెలిపించాలని బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి విజ్జప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు .

ర్యాలీతోపాటు ఇంటింటి ప్రచారం చేపట్టి ఓటర్ల‌ను కలుసుకొని సుమిత్రమ్మను సర్పంచ్ గా గెలిపించాలని ఆయన అభ్యర్థించారు .18 ఏళ్లుగా సంగంబండ పునరావాస సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(People’s government) ఏర్పడ్డాక స్థానిక ఎమ్మెల్యే, మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Minister Dr. Vakiti Srihari) ఆధ్వర్యంలో సంగంబండ నిర్వాసితులకు రావాల్సిన మొత్తం చెల్లించడమే కాకుండా కెనాల్ బండను తొలగించి 20 గ్రామాలకు సాగునీరు అందించడం జరిగిందన్నారు.

అదేవిధంగా మిగిలి ఉన్న సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన సుమిత్రమ్మను గెల్పించవలసిందిగా ఆయన ఓటర్లను కోరారు. ప్రతిపక్ష పార్టీల వల్ల ఏది సాధ్యం కాదని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని అన్నారు. అందుకే అభివృద్ధి సంక్షేమం(welfare) కోసం పంచాయతీ ఎన్నికల్లో సంగంబండ సర్పంచ్ గా సుమిత్రమ్మ ను భారీ మెజారిటీతో గెలిపించాలని బాలకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply