కేంద్ర మంత్రి చౌహాన్‌కు స్వాగతం

గన్నవరం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నకేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి జి. బాల సుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛం అందించి ఆర్డీఓ గౌరవ స్వాగతం ప‌లికారు.