welcome | నిరుపేద ప్రజల కోసం సర్పంచ్ బరిలో ఆడబిడ్డ

welcome | నిరుపేద ప్రజల కోసం సర్పంచ్ బరిలో ఆడబిడ్డ

welcome | మంథని రూరల్, ఆంధ్ర‌ప్ర‌భ : నిరుపేద ప్రజల సమస్యలు తీర్చడానికి ఎన్నికల్లోకి వచ్చానని ఆశీర్వదించాలని బందెల శారద లక్ష్మణ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో(local body elections) మంథని మండలం భట్టుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు ఆమె తెలిపారు.

ఎన్నికల సంఘం ఫుట్ బాల్ గుర్తు కేటాయించడం జరిగిందని, ఫుట్ బాల్ గుర్తుకు ఓటేయాలని అన్నివేళలా ప్రజలకు అండగా ఉంటానని ఆమె పేర్కొన్నారు. ప్రచారంలో ప్రజలతో మమేకమై ఆమె దూసుకు వెళ్తున్నారు. స్థానిక సమస్యల పైన అవగాహన ఉండడం కలిసొచ్చే అంశం.

ప్రజల మద్దతుతో ఖచ్చితంగా ఎన్నిక‌ల్లో గెలిచి తీరుతానని ఆమె తెలుపుతున్నారు. భట్టుపల్లి గ్రామంలో నిరుపేద ప్రజలకు, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఆమె వివరించారు. గ్రామంలో అన్ని వార్డుల ప్రజలను కలుపుకుంటూ ప్రచారంలో అందరికంటే ముందు దూసుకెళుతున్నారు. ప్రచారంలో ప్రజలు ఆమెకు ఘన స్వాగతం(welcome) పలుకుతున్నారు. ఎన్నికల్లో ఫుట్ బాల్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని ఆమె కోరుతున్నాను.

Leave a Reply