అడుగడుగునా అడ్డుకుంటాం..

అడుగడుగునా అడ్డుకుంటాం..

నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : భారత దేశ గౌరవాన్ని కించపరుస్తూ సైనికుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy మాట్లాడిన తీరును ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ నాగిరెడ్డిపేట శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ రోజు నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను ఊరేగించిన అనంతరం దహనం చేశారు.

ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు భారత సైనికులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పేవరకు రేవంత్ రెడ్డిని అడుగడుగునా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూరను అపహాస్యం పాలు చేసే విధంగా మాట్లాడాడని పాకిస్తాన్(Pakistan)కు మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడుతూ ఈ దేశ సమగ్రతను, సైనికులను కించపరిచే విధంగా ఒక సీఎం మాటలు ఉండడం రాష్ట్ర ప్రజలకి సిగ్గుచేటని విమర్శించారు.

వెంటనే దేశ సైనికులకు ఆపరేషన్ సింధూర్(Operation Sindhur) నిర్వహించిన ఉత్తమమైనటువంటి మహిళ మేజర్లకు క్షమాపణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల హన్మండ్లు(Goats’ Hanmandlu), కిషన్ బీజేవైఎం అధ్యక్షులు రాజా గౌడ్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రాజు. నాయకులు నరేందర్ రెడ్డి. విష్ణు. గోపాల్, విజయ్ గౌడ్, అనిల్ రెడ్డి, రాజు, సిద్ధి రాములు మండల బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply