ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం

రైతులకు మద్దతు ధర కల్పిస్తాం.. దళారులను నమ్మి మోసపోవద్దు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, ఆంధ్రప్రభ:
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ప్రతి ధాన్యం గింజకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందని నకిరేకల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం తెలిపారు. గురువారం చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జడల చిన్నమల్లయ్య, గ్రామ సర్పంచ్‌ ఆవుల సుందరయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం, నర్ర మోహన్‌రెడ్డి, అంతటి నరసింహ, రైతులు పాల్గొన్నారు.