పంట నష్టం అంచనాలు రూపొందిస్తాం
- దివిసీమలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్(Konidela Pawan Kalyan) తెలిపారు. కృష్ణా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలంలో నేలకొరిగిన వరి పంటను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గురువారం పరిశీలించారు. రోడ్డు మార్గంలో మచిలీపట్నం బైపాస్(Machilipatnam Bypass) మీదుగా అవనిగడ్డ నుంచి కోడూరు శివారు కృష్ణాపురం చేరుకున్నారు.
అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ స్వయంగా పంట పొలంలోకి దిగి రైతులు కోట రామచంద్రరవు, రమేష్, వెంకటేశ్వరరావులతో మాట్లాడారు. వరి పంట కంకి దశలో ఉండగా నేలకొరిగినట్లు రైతులు తెలిపారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర(State Minister Kollu Ravindra), ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ, కలెక్టర్ డికె. బాలాజీ, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. అవనిగడ్డలో కోట కృష్ణమూర్తికి చెందిన అరటి పంటను పరిశీలించారు.
అనంతరం అవనిగడ్డ చేరుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తుఫాన్ ఛాయచిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు. విద్యుత్ ఉపకేంద్రం వద్ద జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యేను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభత్వం(State Govt) రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. పంట నష్టం అంచనాలు సకాలంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. క్యాబినెట్లో దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి దృ ష్టికి తీసుకెళ్తాను. కేంద్రాన్ని కూడా ఎంత సాయం అడగాలో రిపోర్టు ప్రకారం అడుగుతానని తెలిపారు.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

మోపిదేవిలోని శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి(Shri Subrahmanyeswaraswamy)వారిని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు. ఆర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలుత నాగపుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆనంతరం బి. స్వామివారిని దర్శించుకోగా, ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.

