ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతా

  • నీర్నెముల కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కందిమల్ల గోపాల్ రెడ్డి

రామన్నపేట, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కందిమల్ల గోపాల్ రెడ్డి అన్నారు. ఈ రోజు భారీ ర్యాలీగా బయలుదేరి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హాయంలోనే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని వారు అన్నారు. గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆడపడుచులు,యువకులు ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు.

Leave a Reply