బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ..

బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ..

ఏర్పేడు, అక్టోబర్ 29 (ఆంధ్రప్రభ) : వరద బాధితులైన గిరిజనులను అన్ని విధాల ఆదుకుంటామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మొంధా తుఫాన్ కారణంగా ఏర్పేడు మండలంలో నచ్చనేరి గిరిజన కాలనీ ప్రజలను దుగ్గిపేరి వద్ద నున్న స్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో పరామర్శించారు. మండలంలో వెంకటం పాలెం, కుప్పయ్య కండ్రిగ, మేర్లపాక తదితర పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న వారి వివరాలను తహసీల్దారు ఎం భార్గవి, ఎంపీడీవో డాక్టర్ సౌభాగ్యమ్మలు ఎమ్మెల్యేకు వివరించారు. వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.

ఒక్కో కుటుంబానికి 25కిలోల బియ్యం, పామాయిలు, కూరగాయలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. 25 కుటుంబాలకు సాయం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాసిల్దారు భార్గవి, ఎంపీడీవో సౌభాగ్యమ్మ, సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ ప్రెసిడెంట్ పేరం నాగరాజ నాయుడు, టీడీపీ సీనియర్ నాయకుడు పేరం ధనంజయులు నాయుడు, మాజీ మండల టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ పున్నారావు, ఏర్పేడు సింగల్ విండో అధ్యక్షుడు మహేష్ రెడ్డి, కృష్ణవేణి, రాచేటి సుబ్రహ్మణ్యం, గుణ యాదవ్, నరసింహులు నాయుడు, రవీంద్ర, కేకే రమణ, ముని రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి చంద్రశేఖర్ నాయుడు, పార్థసారధి రెడ్డి నాగేశ్వరరావు, హరి రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, జై చంద్రారెడ్డి , కృష్ణయ్య యాదవ్, సుబ్రామ్ రెడ్డి, వెంకటరమణ, రామచంద్రారెడ్డి, కృష్ణంపల్లి చంద్ర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply