అన్నిపార్టీలతో వెళ్లి పరిస్థితి వివరిస్తాం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : అన్ని పార్టీ ప్రతినిధులతో సోమవారం గవర్నర్ జిష్ణువర్మ దేవ్(Governor Jishnu Varma Dev)ను కలవనున్నామని, బీసీ బిల్లు పరిస్థితి వివరిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Ponnam Prabhakar Goud) అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మంత్రి చిట్‌చాట్(Chitchat) సందర్భంగా అనేక అంశాలు ప్రస్తావించారు.
రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్మెంట్ (chit chat, appointment)అడుగుతున్నామని, కానీ ఇవ్వడం లేదన్నారు. తమ విధానం తాము గవర్నర్‌కు వివరిస్తామని, ఆ తర్వాత గవర్నర్ నిర్ణయమని అన్నారు. న్యాయ పరంగా అన్ని విషయాలు తెలుసుకొని బిల్లు రూపొందించామన్నారు. సభలో అందరికి ఏకాభిప్రాయం ఉన్న విషయాన్నిగవర్నర్(governor) పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహిస్తామని, బీసీలకు 42 శాతం(42 percent for Governor and BC) రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. తాను కూడా లా చేశానని, అయితే ప్రాక్టిస్ చేయలేదని, తనకు అవగాహన లేకుండా మాట్లాడటం లేదన్నారు.