తప్పకుండా ఆదుకుంటాం..
టేకుమట్ల (ఆంధ్రప్రభ):
మొంథా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గుమ్మడివెల్లి గ్రామంలో ఎమ్మెల్యే జీ.ఎస్.ఆర్ వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి, పత్తి, మిరప పంటలను పరిశీలించారు.
భూపాలపల్లి ఎమ్యేల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. రైతులు అనేక కష్టాలు పడి పండించుకున్న పంట ఒక్క రాత్రిలో తుఫాన్ వల్ల నాశనం అయిందని . రైతుల చెమట చుక్కల విలువ తెలిసిన ప్రభుత్వం మనదన్నారు. తుఫాన్ తో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని, ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు హామీ ఇచ్చారు సమగ్ర పంట నష్టం సర్వే చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. త్వరితగతిన పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వం వద్దకు నివేదిక పంపి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

