President | మహనీయులను స్మరించుకోవాలి
వేల్పూర్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు
వేల్పూర్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాల మహానాడు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ వేల్పూర్ మండలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. B. R. Ambedkar) విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ క్రాంతి మాట్లాడుతూ.. రాజ్యాంగం అందించిన హక్కులు, స్వేచ్ఛలు, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ప్రతి భారతీయుని బాధ్యత అని, సమాజం ప్రగతి పథంలో సాగాలంటే అంబేద్కర్ చూపించిన మార్గాన్నే అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షుడు మోహన్ దాసు, వైస్ ప్రెసిడెంట్ క్రాంతి, రవి, బీఆర్ఎస్ నాయకులు రేగుల రాములు, పాడల గంగాధర్ గౌడ్, కుమ్మరి రాజన్న, సుంకరి రాములు, బీజేపీ జిల్లా జనరల్ సెక్రెటరీ నోముల నర్సారెడ్డి, ప్రదీప్, చరణ్, రవిచంద్ర పాల్గొన్నారు.

