ఆల్మట్టి ఎత్తును వ్య‌తిరేకిస్తున్నాం…

సూర్యాపేట‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఆల్మట్టి డ్యాం (Almatti Dam) ఎత్తు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. రేపు ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాంపై వాదనలు వినిపిస్తామని చెప్పారు. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆయన పాలకవీడు మండలం జవహర్ జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో కూలిపోయే కాళేశ్వం కట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతోందని, విచారణ తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతామని అన్నారు.

Leave a Reply