AP | అభివృద్ధిని, సంక్షేమాన్ని సమంగా ముందుకు తీసుకెళ్తున్నాం.. మంత్రి జనార్ధన్ రెడ్డి
కర్నూల్ బ్యూరో : రాష్ట్రంలో అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమపాలనలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పత్తికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ ఆవరణం నందు శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తిరుణాల సందర్భంగా పత్తికొండ ప్రీమియర్ లీగ్ సౌత్ ఇండియా లెవల్ టి -20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ కార్యక్రమాన్ని నిర్వహించారు..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అటు పోలవరం ఇటు అమరావతి మౌలిక సదుపాయాలకు సంబంధించిన రోడ్ల మరమ్మతుల పనులు అన్నిటిలోనూ అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వమన్నారు. యువత దురలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలన్నారు… యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు గాను పత్తికొండ ఎమ్మెల్యే గత 18 రోజులుగా నిర్వహిస్తున్న పత్తికొండ ప్రీమియర్ లీగ్ కార్యక్రమాలు అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన కార్యక్రమాలను నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం అభినందనీయమని మంత్రి పత్తికొండ ఎమ్మెల్యేను అభినందించారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అభివృద్ధి ఏమి చేయలేదన్నారు.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అటు సంక్షేమంతో పాటు ఇటు అభివృద్ధి పనులు కూడా పరుగులు పెట్టిస్తున్నామన్నారు… 2014 – 2019 సంవత్సరాల మధ్య కాలంలో క్రీడలకు సంబంధించిన స్టేడియం లను ఏర్పాటు చేసామన్నారు.. ఇప్పుడు మరి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు కొన్ని స్టేడియంలు నిర్మిస్తున్నామన్నారు…
పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ శ్యాంబాబు మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలలో యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం వల్ల వారిలో ఉండే ప్రతిభ బయటికి వస్తుందన్నారు….రానున్న రోజుల్లో ఇంకా పెద్ద స్థాయిలో ఇటువంటి ఆటల కార్యక్రమాలను నిర్వహించే విధంగా చర్యలు చేపడతామన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు మాట్లాడుతూ… యువకులలో, విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించే విధంగా సౌత్ ఇండియా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందించాల్సిన విషయం అన్నారు.. ఈ అంశాన్ని ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే స్ఫూర్తిగా తీసుకొని వారి వారి నియోజకవర్గాలలో ఈ విధమైన ఆటల పోటీలు నిర్వహించాలని తద్వారా విద్యార్థులలో, యువకులలో క్రీడా స్ఫూర్తి ప్రోత్సహించిన వాలవుతారన్నారు..
వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ మాట్లాడుతూ.. ఇంత పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పత్తికొండ ఎమ్మెల్యే గారిని అభినందించాలన్నారు… ఇటువంటి కార్యక్రమాలు క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు.. విద్యార్థులు, యువకులు అందరూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారిలో ఉండే ప్రతిభ బయటకు వస్తుందన్నారు… పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు…క్రీడలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు ఫ్రెష్ మైండ్ తో చదువుకోవడానికి లేదంటే ఇతర పనులు చేసుకునేందుకు విద్యార్థులకు క్రీడలు చాలా ఉపయోగపడుతాయన్నారు..తొలుత పత్తికొండ ప్రీమియర్ లీగ్ సౌత్ ఇండియా లెవల్ టి -20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ (బళ్ళారి V/s పత్తికొండ) టాస్ వేసి మంత్రి, పత్తికొండ శాసనసభ్యులు, ఎస్పీ ప్రారంభించారు…
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, మాజీ మంత్రి కె.యి కృష్ణ మూర్తి , జిల్లా నాయకులు తిక్కారెడ్డి, మంత్రాలయం ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.