AP | ఉత్తరాంధ్రకు జలధార.. చంద్రబాబు జలహారతి..

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరుకున్నాయి. ఈ చారిత్రక ఘట్టానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. రెగ్యులేటర్‌ను ఆన్ చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేశారు.

ముందుగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ కాలువ వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చారు.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న గోదావరి జలాల తరలింపు ప్రక్రియ పూర్తికావడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో వ్యవసాయ అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని అధికారులు చెబుతున్నారు. ఈ నీటి ప్రవాహం ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.