అవుట్ ఫ్లో 1,65972 క్యూసెక్కులు
( శ్రీశైలం, ఆంధ్రప్రభ): ఎగువ భారీ వర్షాలతో కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తోంది. జూరాలను దాటి శ్రీశైలం(Srisailam)లో అడుగు పెట్టింది. జూరాల, సుంకేసుల బ్యారేజీల నుంచి 2,25,038 క్యూసెక్కుల వరద నీరు చేరింది. జూరాల(Jourala) నుంచి 35,472 క్యూసెక్కులు, స్పిల్ వే నుంచి 1,27,548 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 61,768 క్యూసెక్కులు హంద్రీ(Handri) నుంచి 250 క్యూసెక్కులు నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరింది.
ఇన్ పుట్ 2,50,659 క్యూసెక్కులు
మొత్తం ఇన్ ఫ్లో 2,50,659 క్యూసెక్కులు కాగా.. పవర్ జనరేషన్ కు 66,280 క్యూసెక్కులు వినియోగించారు. ఇందులో కుడి పవర్ హౌస్ కు 30,965, ఎడమ పవర్ హౌస్ కు 25,315 క్యూసెక్కులు వినియోగించారు. ఆరు గేట్లను పది అడుగులు ఎత్తి నాగార్జున సాగర్(Nagarjuna Sagar)కు 1,65,972 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
జలాశయంలో నీటి నిల్వ 210 టీఎంసీలు
ప్రస్తుతం జలాశయం నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగ, ప్రస్తుతం జలాశయంలో 210.51 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

