నాగార్జునసాగర్, ఆంధ్రప్రభ: నాగార్జునసాగర్ ఎడమ కాలువకు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఎన్నెస్పీ (NSP) అధికారులు తెలిపారు. కాలువ ద్వారా నీటి విడుదలతో ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీటి విషయంలో ఊరట లభించనుంది. నీటి విడుదలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.