సాగ‌ర్ నుంచి నీటి విడుద‌ల‌

ఆంధ్ర‌ప్ర‌భ విజ‌య‌పురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. శనివారం ఉదయం 10.00 గంటలకు అందిన బులిటెన్ ప్రకారం, ఇన్ ఫ్లో 1,65,395 క్యూసెక్కులు కాగా.. కృష్ణానదిలోకి 1,46,370 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్తు కేంద్రానికి 33.698 క్యూసెక్కులు ఇచ్చి 18 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి 1,12,762 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో నీటి నీల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా… ప్రస్తుతం నీటి నిల్వ 310.55 టీఎంసీలకు చేరింది.

Leave a Reply