Minister | నీటి శుద్ది కేంద్రం ప్రారంభం

Minister |నీటి శుద్ది కేంద్రం ప్రారంభం
Minister |ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : ములుగు మండలంలోని జగ్గన్న పేట గ్రామంలో రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన సామాజిక నీటి శుద్ది కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో (With Market Committee Chairman Rega Kalyani) కలసి ప్రారంభించారు. అనంతరం ఉచిత వైద్య శిబిరంను ప్రారంభం, కోటక్ మహేంద్ర వారి సహకారంతో 175 మందికి ఉచిత శిక్షణ ధృవీకరణ పత్రం, ఉచిత కుట్టుమిషన్లు, ఎస్సీ కార్పొరేషన్ (SC Corporation) ఆధ్వర్యంలో కురేందుల శంకర్, 8మంది ఇతరులకు 9 యూనిట్లు పాడి గేదెలను (ఒక లక్ష నలుబై వేల రూపాయల సబ్సిడీతో ), ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. వారితో పాటు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, ఏ పి ఎం శ్రీనివాస్, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, కోటక్ మహేంద్ర ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

