ప|| అర్ధనారీశ్వరికీ అంబ పరమేశ్వరికీ
మల్లిఖార్జున రాణికీ భ్రమరాంబకూ నీరాజనం
అను|| శ్రీశైల శిఖరాన చిద్విలాసంతో నటరాజ
శేఖరునకు భ్రమరాంబ మల్లిఖార్జునకు నీరాజనం
చ|| అర్ధ భాగము అఖండ తేజము వృషభ వాహనము
కరి చర్మాంబర ధారునకూ సర్పభూషణకూ
నీలకంఠునకూ మా మల్లిఖార్జు మహరాణికీ
అర్ధనారీశ్వరు దేవికీ భ్రమరాంబకూ
మల్లిఖార్జునకూ నీరాజనం