కాజ్‌వే నుంచి నీరు ప్రవాహం

కాజ్‌వే నుంచి నీరు ప్రవాహం

( పిచ్చాటూరు, ఆంధ్రప్రభ) : తుపాన్ (Cyclone) ప్రభావంతో కొనసాగుతున్న వర్షాల నేపథ్యంలో అరనియార్‌ ఆనకట్ట, కాజ్‌వే పరిస్థితిని పోలీసులు పరిశీలించారు. పుత్తూరు రూరల్‌ డీఎస్పీ రవి, పిచ్చాటూరు ఎస్‌.ఐ వెంకటేష్‌ సోమవారం రిజర్వాయర్‌ ప్రాంతాన్ని సందర్శించారు.పిచ్చాటూరు కేవీబీపురం మండలాలను కలిపే కాజ్‌వే వద్ద నీటి మట్టాన్ని పరిశీలించి, ప్రస్తుతం నీరు కాజ్‌వే క్రిందుగా ప్రవహిస్తున్నప్పటికీ ఎటువంటి ప్రమాద పరిస్థితి లేదని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా డీఎస్పీ రవి మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరం లేని సమయంలో వాగులు, చెరువుల వద్దకు వెళ్లరాదు అని సూచించారు. పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply