water | శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం…

water | శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం…
water | చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామంలో అన్ని వార్డులలో నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ తెలిపారు. మంగళవారం మండలంలోని చిన్న కపర్తి గ్రామంలో ఇంటింటికి సరఫరా అవుతున్న నల్ల పైపులైన్ల మరమ్మతులను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలుచోట్ల పైప్లైన్లు లీకేజీలు ఉన్నచోట్ల మరమ్మత్తులు, శిథిల వ్యవస్థలో ఉన్న పైప్ లైన్ లను తీసివేయడం జరుగుతుందని, పనులు పూర్తయితే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వస్తుందని అన్నారు. రాబోయే వేసవికాలం దృష్ట్యా గ్రామంలో అన్ని వార్డులలో తాగునీటి సమస్యకు పటిష్టమైన చర్యలు సర్పంచ్ తీసుకోవడంతో గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

