మేడ్చల్‌లో కేటీఆర్‌కు ఘన స్వాగతం

మేడ్చల్‌లో కేటీఆర్‌కు ఘన స్వాగతం

  • బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ
  • కేటీఆర్ రాకతో మేడ్చల్‌లో గులాబీ పండుగ

​మేడ్చల్, నవంబర్ 1(ఆంధ్రప్రభ): ​అదిలాబాద్ ‘రైతు గర్జన’ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మేడ్చల్‌ పట్టణంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన రాకతో మేడ్చల్‌లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, సందడి నెలకొంది.

​ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, చామకూర మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మద్దుల శ్రీనివాస్ రెడ్డితో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.