Warangal | గెలుపు సంబురాలు…
Warangal | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటితో గెలుపొందటంతొ నెల్లికుదురు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యాకర్తలు టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి(Congress Party development) సంక్షేమ కార్యక్రమాలకు జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గూగులోత్ బాలాజీ నాయక్(Googlelot Balaji Naik) అన్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అరాచకాలను జూబ్లీహిల్స్ ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారాన్ని నిర్వహించి, కేవలం రెండు సంవత్సరాల రేవంత్ పాలనలో అందిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించామన్నారు.
ప్రతి పేదవాడు కడుపునిండా అన్నం తినాలన్న సంకల్పంతో అమలు చేస్తున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంట్, రేషన్ కార్డు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై నవీన్ యాదవ్ ను గెలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో మౌనేందర్, ఎల్లారెడ్డి, శ్రీనివాస్ నాయక్, క్రాంతి రెడ్డి, లింగమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

