కరీమాబాద్, ఆంధ్రప్రభ : మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు ఆదేశానుసారం సీఎం రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకొని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో వరంగల్ కాంగ్రెస్ నేతలు పూజలు నిర్వహించారు. సీఎం ఆయురారోగ్యాలతో భవిష్యత్‌లో ప్రజలకు మరింత సేవలు చేయాలని, ప్రజా ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి మరింత ముందుకు పోవాలని అమ్మవారిని ప్రార్థించినట్లు నేతలు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్స్ ఆకుతోట శిరీష్, బోగి సువర్ణ సురేష్, ముఖ్య నాయకులు మబ్బు ప్రవీణ్, తోట వేణుగోపాల్, శ్రీరాం రాజేష్, సంగరబోయిన చందర్, ప్రతాప్, బోలెషా, ప్రవీణ్ పాల్గొన్నారు.
పెద్దమ్మగుడిలో వరంగల్ కాంగ్రెస్ నేతల పూజలు

