ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా

ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా

  • 29వ వార్డు బిజెపి అభ్యర్థి రాకాసి బిందు రెడ్డి

వనపర్తి ప్రతినిధి: ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ): వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో 29వ వార్డు నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఓటర్లు ఆశీర్వదించి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని 29వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి రాకాసి బిందురెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మీ అమూల్యమైన ఓటు కమలం గుర్తుపై వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వార్డులో మౌలిక వసతుల కల్పనకు, అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రధానమంత్రి మోడీ చిత్తశుద్ధితో ఉన్నారని మధ్యతరగతి ప్రజల కోసం, దేశ రక్షణ, పేద ప్రజల సంక్షేమం,పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, ఆడపిల్లల అభివృద్ధి కోసం బిజెపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దేశ ప్రజలంతా ఆదరిస్తున్నారని తెలిపారు. పట్టణ ప్రగతి బిజెపితోనే సాధ్యమని వివరించారు.

మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి సహకారంతో సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. నీతి నిజాయితీకి కట్టుబడి ప్రజాభిన్నతికి పాటుపడతానని తెలిపారు. వార్డు ప్రజలు ఆలోచించి ఈనెల 11న జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని రాకాసి బిందు రెడ్డి ఓటర్లను కోరారు.

Leave a Reply