వృద్ధురాలి దుర్మ‌ర‌ణం

గూడూరు, ఆంధ్ర‌ప్ర‌భ : తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోడ కూలిన దుర్ఘ‌ట‌న‌లో ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గూడూరు (Guduru) మండలంలో నిన్న రాత్రి జ‌రిగింది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.


గూడూరు మండలంలోని గాజుల గట్టు గ్రామానికి చెందిన కోల రామక్క(65) నిద్రిస్తున్న సమయంలో తుఫాను ప్రభావంతో గోడ నాని ఒకసారి కూలింది. గోడ శిథిలాలు ప‌డ‌డంతో నిద్రిస్తున్న రామ‌క్క దుర్మ‌ర‌ణం పాలైంది. తెల్లవారుజామున ఇంకా బయటికి రావడం లేదని వెళ్లి ఆమె కోడలు చూసేసరికి గోడ కూలి వృద్ధురాలు మృతి చెందిన సంఘ‌ట‌న చూసి ల‌బోదిబోమంది. గ్రామస్తుల సహకారంతో మట్టిని తొల‌గించి వృద్ధురాలు మృతి దేహాన్ని బయటికి తీశారు.

Leave a Reply