నాలుగు రోజులుగా నీళ్ల కోసం ఎదురుచూపులు

మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో రోడ్డెక్కిన మహిళలు
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం ముత్తునూరు గ్రామంలోని మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హనుమాన్‌నగర్‌కు గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ మహిళలు, గ్రామ‌స్తులు ప్రధాన రహదారి అయిన ఆదిలాబాద్ టు మంచిర్యాల్ రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు. నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కోసం ఇతర మార్గాలపై ఆధారపడాల్సి వస్తోందని వాపోయారు. తక్షణమే స్పందించి మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించాలని, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. నీటి సమస్యపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అనంతరం గ్రామ పటేల్ హెచ్‌కే జంగు వద్దకు వెళ్లి సమస్యను వివరించగా స్థానిక సర్పంచ్ రితే విటల్ మిషన్ భగీరథ నీటిని నేటి నుంచి ప్రారంభించి డిసెంబర్ జనవరి నెలలో బోరు వేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.