Voter | ఆదరించండి…అభివృద్ధి చేసి చూపిస్తా

Voter | ఆదరించండి…అభివృద్ధి చేసి చూపిస్తా
- సర్పంచ్ అభ్యర్థి ఎర్ర నీస్సీ వినోద్ కుమార్
Voter | రెంజల్, ఆంధ్రప్రభ : అవకాశం ఇచ్చి ఆదరించండి…అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ (Congress Party) బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎర్ర నీస్సీ వినోద్ కుమార్ ఓటర్లను వేడుకున్నారు. మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింట తిరుగుతూ ఓటరు మహాశయులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ఈనెల 11న జరిగే సర్పంచ్ ఎన్నికలలో కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని ఆశ భావం వ్యక్తం చేశారు.
వీరన్నగుట్ట గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనను అందించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామన్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడమే నా ధ్యేయమని, తాగునీటి (Water) సమస్య పరిష్కారం, వీధి దీపాల ఏర్పాటు, మురికి కాలువల శుద్ధి, పేదలకు సహాయం వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానన్నారు. గ్రామ అభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో మరింత ముందు సాగుతానని తెలిపారు. సర్పంచ్ గా తనకు కేటాయించిన గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఎర్ర నీస్సీ వినోద్ కుమార్ ప్రజలను వేడుకున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్సై సురేందర్ రాజ్, మాజీ సర్పంచ్ వినోద్ కుమార్, మాజీ ఎంపీటీసీ ఎల్లయ్య, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు ధరింబీర్, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
